BRO: రీమేక్ అయినా… అది పవన్ కళ్యాణ్ సినిమా

ఒక భాషలో సినిమా హిట్ అయిందంటే, దాన్ని ఆటోమెటిక్‌గా మిగతా భాషల్లోకి డబ్ చేస్తారు. సొంత భాషలో సూపర్ హిట్ అవుతుంది. కొన్ని సార్లు వేరే భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలా ఈ మధ్య కాలంలో కాంతార, 2018తో పాటు చాలా సినిమాలు హిట్ అయ్యాయి. గతంలో కూడా కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కానీ అవి పెద్దగా హిట్ కాలేదు. అందులో చెప్పుకోవాల్సినవి. అజిత్ నటించిన వీరుడొక్కడే, సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ సీతం.

ఈ రెండు సినిమాల గురించే ఎందుకు అంటే, ఈ రెండు సినిమాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రీమేక్ చేశారు. చేస్తున్నారు. అజిత్ తమిళంలో వీరం అనే సినిమా చేయగా, దాన్ని తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్ చేశారు. దీన్నే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అనే పేరుతో రీమేక్ చేశాడు. ఇది చేదు ఫలితాన్ని ఇచ్చినా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం మాస్ ట్రీట్‌ను ఇచ్చింది.

తాజాగా ఇప్పుడు తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాను తెలుగులో BRO అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. దీనికి సముద్రఖనియే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ బ్రో సినిమాకు కూడా కాటమరాయుడు లాగే చేదు ఫలితాన్ని ఇస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రస్తుతం బ్రో సినిమాకు సంబంధించి బిజినెస్ డీటైల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రో దాదాపు 100 కోట్ల మేర బిజినెస్ జరుపుకుందట.

- Advertisement -

నిజానికి ఇది చిన్న సినిమా. కానీ, పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే సినిమా మోస్ట్ అవేటైడ్ మూవీగా మారింది. అంతే కాకుండా దీనిలో దేవుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నాడంటే హైప్ భారీగా క్రియేట్ అయింది. దాన్ని వల్లే 100 కోట్ల బిజినెస్ అయిందని చెప్పొచ్చు. అయితే బిజెనెస్ ఎంత అయినా, కలెక్షన్లు మాత్రం భారీగా వస్తాయని కొంతమంది సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించక చాలా రోజులు అవుతుంది. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ అందరూ దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్… సిల్వర్ స్క్రీన్ పై దేవుడి పాత్రలో కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని కూడా అంటున్నారు.

బ్రో సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. కాగా, బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు