Salaar Teaser Talk: అంచనాలను మించిన టీజర్… నో కన్‌ఫ్యూజన్ సలార్ డేంజరస్. కానీ..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జాతకాన్ని ఒక ఫ్రైడే మార్చేస్తుంది. మాములుగా కొన్ని సినిమాలు రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్ సాధిస్తాయి. అలా మాములు సినిమాగా వచ్చిన కెజిఎఫ్ సినిమా ఊహించని విజయాన్ని సాధించింది. కేవలం విజయాన్ని సాధించడమే కాకుండా పార్ట్ 2 పై భారీ అంచనాలను నెలకొల్పింది. కెజిఎఫ్ -2 ను కూడా బాక్స్ వద్ద భారీ కలక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

కెజెఎఫ్ సినిమాతో సౌత్ ఇండియా సినిమాను ఒక ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజిఎఫ్ లో ప్రతి సీన్ ప్రతి ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ లాంటి ఒక యాక్షన్ ఫిలిం ప్రభాస్ కెరియర్ లో పడితే ఆ ఊహే ఒక హై ఇస్తుంది కదా. ఇప్పుడు రిలీజైన సలార్ టీజర్ అంతే హైప్ ను ఇచ్చింది.

ముఖ్యంగా ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ చూపించిన విధానం గూస్బమ్స్ తెప్పించింది అని చెప్పొచ్చు. ప్రభాస్ ఆరడుగుల కటౌట్ కి సరిపడా కంటెంట్ సరిగ్గా ఇప్పుడు పడింది అనేలా ఉంది ఈ టీజర్. టీజర్ లో ముఖ్యంగా రవి బసూర్ అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. ఎప్పుడు పీస్ ఫుల్ గా కనిపించే ప్రశాంత్ నీల్ ఈ టీజర్ తో అరాచకానికి అర్ధం చూపించాడు.

- Advertisement -

టీజర్ ను ఒక్కో భాష కు ప్రత్యేకంగా కాకుండా సింపులు ఇంగ్లింష్ లో అన్ని భాషల ఆడియన్స్ కు అర్థమయ్యేలా ప్రశాంత్ నీల్ డీజైన్ చేశాడు. దీనిలో  సలార్ హీరో ప్రభాస్ ఒక ఓల్డ్ వ్యక్తితో ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు అని చెప్పొచ్చు. “చితా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్… బట్.. నాట్ ఇన్ జూరాసిక్ పార్క్. ఇన్ దట్ పార్ట్క్….” అనే డైలాగ్ ఎండ్ అయ్యే సరికి ది మోస్ట్ వైలెంట్ పర్సన్ ప్రభాస్ కనిపిస్తాడు.

ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఈ ఎలివేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ అభిమానుల అంచనాలను మించిన ఈ టీజర్, రాబోయే సలార్ ట్రైలర్ పై కూడా అంచనాలు పెంచుతుంది. కాగా, సలార్ చిత్రం రిలీజ్ డేట్.. ఈ ఏడాది సెప్టెంబర్ 28న అని అందరికీ తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు