Akhanda: ద్వారకా క్రియేషన్స్ లో భారీ చిత్రం. రిస్క్ చేస్తున్నారా?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను నిర్మించిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మరో భారీ చిత్రం రాబోతుంది. ఆ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల పని చేయనుండగా భారీ తారాగణం తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ డెబ్యూ హీరో సినిమాకు దాదాపు 40 నుండి 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు టాక్ నడుస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్ మెంట్ అప్ డేట్ ను మేకర్స్ తెలియచేసారు. గాయాలతో ఉన్న ఒక చేయిని చూపిస్తూ ఉన్న స్టిల్ ని విడుదల చేసారు. జూన్ 2 న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చేస్తున్నామని మేకర్స్ తెలియచేసాడు.

అయితే ఒక డెబ్యూ హీరో సినిమాకు ఇంత భారీమొత్తంలో ఖర్చు పెట్టడం చాలా రిస్క్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. గతంలో ఇలాగే అఖిల్, అల్లుడు శీను లాంటి సినిమాలకు భారీగా ఖర్చు చేసి నిర్మాతలు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అలాంటి రిస్కే ఈ చిత్ర నిర్మాతలు చేస్తున్నారు. అయితే సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు గాని పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలంటే మాత్రం పగడ్బందీ ప్లాన్ తో మంచి ప్రమోషన్లతో హడావిడి చేయాలి. అదీ గాక ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గతంలో తీసిన సినిమా బ్రహ్మోత్సవం ఆడకపోగా, నారప్ప ఓటిటీ లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల తీయబోయే సినిమా తన కెరీర్ కి కూడా చాలా కీలకం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు