Buddy: అల్లు హీరో మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

మంచి ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల “ఊర్వశివో రాక్షసివో” సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్ “బడ్డీ” అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్ప్స్ వీడియోను విడుదల చేసారు.

రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇంకా గ్లిమ్ప్స్ వీడియో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను రేకెత్తిస్తుంది. 2:37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో లో టెడ్డి ను చంపే ప్రయత్నం చేసే ఒక బ్యాచ్ , టెడ్డీని సంరక్షించే పాత్రలో శిరీష్ కనిపిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు సామ్ ఆంటోన్ శిరీష్ ను తనదైన స్టైల్ లో ఎలివేషన్ ఇచ్చి రివీల్ చేసారు. శిరీష్ ఒక ఇంటెన్స్ లుక్ తో ఈ వీడియో లో కనిపిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా బాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ అయింది.

- Advertisement -

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రూబెన్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు