Chakravyuham: ఈ సారైనా ఆ నటుడికి బ్రేక్ వస్తుందా?

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు అజయ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో చిన్న రోల్ ద్వారా పరిచయమై, స్టార్ హీరోల సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటిస్తూ ఏ రోల్ వచ్చినా వదలకుండా అన్ని రకాల పాత్రలు చేసాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “విక్రమార్కుడు” సినిమాలో టిట్లా పాత్ర ద్వారా విలన్ గా ఫేమ్ సంపాదించిన అజయ్ ఆ తర్వాత కూడా మంచి పాత్రలు దక్కించుకున్నాడు.

సైనికుడు, లక్ష్మి కళ్యాణం, కృష్ణాష్టమి,రుద్రమదేవి, కలావర్ కింగ్ లాంటి సినిమాల్లో సెకండ్ లీడ్ క్యారెక్టర్లు కూడా చేసిన అజయ్ 2009 లో “సారాయి వీర్రాజు” సినిమాలో మెయిన్ హీరోగా నటించాడు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అంతగా ఆడలేకపోయింది. చాలా రోజుల తర్వాత అజయ్ లీడ్ రోల్ లో చేసిన సినిమా ఇప్పుడు వస్తుంది. అదే “చక్రవ్యూహం ది ట్రాప్”. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తీయడం జరిగింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియా, కిరీటి, మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 2 న విడుదలకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమా ద్వారానైనా అజయ్ కి హీరోగా బ్రేక్ వస్తుందా లేదా అనేది చూడాలి. చిత్ర యూనిట్ మాత్రం చక్రవ్యూహం సినిమా పై గట్టి నమ్మకంతో ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు