Bholashankar: త్వరలోనే మెగా మ్యూజిక్ మేనియా స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2021 లోనే మొదలైనా వాల్తేరు వీరయ్య సినిమా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత చిరు చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిపోగా, లేటెస్ట్ గా స్విట్జర్ లాండ్ వెళ్లి రెండు పాటలు కూడా షూట్ చేసుకొచ్చారు. ఇక సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసారు చిత్ర యూనిట్.

తాజాగా భోళా శంకర్ మూవీ యూనిట్ నుండి సాలిడ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ అప్ డేట్ ని త్వరలోనే వెల్లడిస్తామని మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ లుక్ స్టిల్ ఒకటి వదిలి తెలియచేసారు. విడుదలైన స్టిల్ ను చూస్తే ముందుగా మెగాస్టార్ కి సబంధించిన ఇంట్రో సాంగ్ ని విడుదల చేస్తున్నారని అర్ధమైపోతుంది. అయితే మెగాస్టార్ నటించిన రీసెంట్ సినిమాల్లో చిరు స్థాయి కి తగ్గ డాన్స్ బీట్ లు పడలేదు. అందువల్ల మెగా ఫ్యాన్స్ చిరంజీవి డాన్స్ ను చాలా మిస్ అవుతున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఆ లోటు తీరుస్తారా లేదా అన్నది చూడాలి.

ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. అటు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్న తొలి స్టార్ హీరో సినిమా కూడా ఇదే. కాబట్టి ఈ సినిమాపై అతను చాలా శ్రద్ధ పెట్టాడు. ఇక ఈ సినిమా తమిళ్ హిట్ వేదాళం రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా నటించింది. భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధం అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు