Telugu Actor: ఆర్.నారాయణ మూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

టాలీవుడ్ ఒకప్పటి హీరో ఆర్.నారాయణ గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ ప్రజల సంక్షేమం, వారి కష్టాలపై సినిమా చేస్తారు ఆర్. నారాయణ. అయితే.. ఈ ఆర్.నారాయణ మూర్తి గోదావరి జిల్లాలో పుట్టిన తెలంగాణ వాది. ఆయన తీసిన సినిమాలు, ఆయన పాడిన పాటలు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలు చేసే వాళ్ళందరూ డబ్బుల కోసం చేస్తుంటే… ఆయన మాత్రం కమర్షియల్ అనే మాట మాట్లాడకుండా చేస్తున్నారు. యువ హీరోలు, దర్శకులు ఆయనను చూసి నేర్చుకోవాలి అంటారు అభిమానులు.

ఇదిలా ఉంటే.. ఆర్.నారాయణమూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించేవి. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “చిన్నప్పుడు నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మా ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. మా అమ్మ, నాన్నలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల కోసం ఆ అమ్మాయిని వదిలేసాను. అసలు నా జీవితంలో పెళ్లి అనేది వద్దనుకున్నాను. పెళ్లి చేసుకోకుండా ఎంతోమంది మహానుభావులు లేరా వారిలో నేను కూడా ఒకడిగా మిగిలిపోతాను” అంటూ చెప్పుకొచ్చారు ఆర్.నారాయణమూర్తి.

కాగా, ఎర్రసైన్యం సినిమా ద్వారా హీరోగా మారి ఆ సినిమాతోనే దర్శకుడిగా కూడా రాణించాడు. ఎర్రసైన్యం సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాదు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఆయన స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఒరేయ్ రిక్షా అనే సినిమాలో హీరోగా నటించాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు