BRO: అంతా ఓవర్. ఇక ఇదొక్కటే మిగిలింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో “బ్రో” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వినోదయసీతం కి రీమేక్ గా పలు మార్పులు చేసి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోల యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లతో “బ్రో” సినిమాపై అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న సమయంలో రానుండడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి చాలా కీలకంగా మారింది. ఇక ఇప్పటికే “బ్రో” సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోగా మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేయదానికి చిత్ర యూనిట్ రెడీ అయింది. తాజాగా “బ్రో” సినిమా కి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నామని చిత్ర యూనిట్ ఈరోజు పూజా కార్యక్రమాల స్టిల్స్ పెట్టి అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వా ప్రసాద్ నిర్మించగా, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ మధ్యే సినిమా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టిన చిత్ర యూనిట్ త్వరలోనే సినిమాకి సంబంధించి పాటలు, ఇంకా టీజర్ ను కూడా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక “బ్రో” సినిమా జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు