Venkatesh: రానా నాయుడుపై తొలిసారిగా స్పందించిన వెంకీ

విక్టరీ వెంకటేష్ దగ్గుపాటి రానాతో కలిసి “రానానాయుడు” అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అమెరికన్ డ్రామా సిరీస్ “రేడోనోవన్” ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ని కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ తీవ్ర విమర్శల పాలయ్యింది. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా ఈ సిరీస్ తో డ్యామేజ్ అయిపొయింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ సిరీస్ లో వెంకటేష్ రానా తండ్రి కొడుకులుగా నటించగా తెలుగులో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన రానా నాయుడు హిందీలో యావరేజ్ గా మిగిలింది.

ఇక అడల్ట్ కంటెంట్ తో పాటు, పరిమితికి మించిన బూతులు ఉండడం ఈ సిరీస్ కు పెద్ద మైనస్. అందుకే ఈ సిరీస్ ని తెలుగు వెర్షన్ కి సంబంధించి మొత్తం ఎపిసోడ్లను నెట్ ఫ్లిక్ తొలగించింది. అయినా అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతం ఈ సిరీస్ వల్ల పోయిన పరువును తిరిగి దక్కించుకునే యోచనలో రానా, వెంకటేష్ సిద్ధమయ్యారు.

ఇక తాజాగా రానా తమ్ముడు అభిరాం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న కొత్త చిత్రం “అహింస” ప్రెస్ మీట్ లో పాల్గొన్న వెంకటేష్ అక్కడ తొలిసారిగా రానా నాయుడు సిరీస్ గురించి స్పందించారు. నిజానికి సినిమా గురించే ప్రెస్ మీట్ పెట్టగా ఆ మీటింగ్ చివర్లో విలేఖరి వెంకటేష్ ని రానా నాయుడు ఫీడ్ బ్యాక్ మీ వరకు వచ్చిందా? దానిపై మీ స్పందన ఏంటి అని వెంకటేష్ ని ప్రశ్నించాడు. అయితే దానిపై మాట్లాడడం ఇష్టం లేని వెంకటేష్ గతం ఖతం అంటూ ముగించే ప్రయత్నం చేసినా కుదరలేదు. కాబట్టి మాట్లాడక తప్పలేదు.

- Advertisement -

రానా నాయుడు గురించి అడగ్గానే అయిష్టంగానే అర్ధం కానీ ఇంగ్లీష్ లో మాట్లాడారు వెంకీ. వెంకటేష్ మాట్లాడుతూ ఆ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ కోపంగా ఉన్నారని, ఆ ఎఫెక్ట్ వాళ్లపై చాలా ఉందని తెలిసింది. తాము ఒరిజినల్ కంటెంట్ ని అలాగే చూపించాలన్న తాపత్రయంలో ఇలా పొరపాటు చేసామని, ఈ తప్పులు సరిదిద్దుకొని సెకండ్ సీజన్ తో అందరికి నచ్చేలా రానా నాయుడు ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికే పోయిన దగ్గుపాటి వారి పరువును రానా నాయుడు సెకండ్ పార్ట్ తో తిరిగి దక్కించుకుంటారా? లేక మొదటికే మోసం వస్తుందా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు