Tollywood: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న చిన్న సినిమాలు?

Tollywood:

టాలీవుడ్ లో ప్రతి వారం చిన్న సినిమాలు రెండు నుండి అరడజను సినిమాల వరకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. పోయిన వారం కూడా రెండు డబ్బింగ్ సినిమాలు ఒక స్ట్రెయిట్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ వారం మాత్రం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకపోతుండడం ఆశ్యర్యంగా ఉంది. నిజానికి ఈ వారం రిలీజ్ కావాల్సిన పలు సినిమాలు వచ్చే నెలకు వాయిదా పడ్డాయి. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన “సప్త సాగరాలు దాటి” అనే డబ్బింగ్ సినిమా ఒక్కటే రిలీజ్ అవుతుంది.

అయితే సలార్ రిలీజ్ డేట్ చేంజ్ అవడం వల్ల ఇన్ని మార్పులు జరిగాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 15కి రిలీజ్ కావాల్సిన స్కంద, పెదకాపు 28కి పోస్ట్ పోన్ కాగా, సెప్టెంబర్ 21 రిలీజ్ డేట్ ని మాత్రం చాలా సినిమాలు మిస్ చేసుకున్నాయి. పెద్ద సినిమాలకు ఈ డేట్ పెద్దగా కలిసి రాకపోవచ్చు గాని, చిన్న సినిమాలు ఈ టైం కి రిలీజ్ అయ్యి ఉంటె వాటికి ఒక గోల్డెన్ ఛాన్స్ అయ్యేది. వినాయక చవితి సందర్భంగా చిన్న సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చేవి.

నిమజ్జనం వరకు మినిమం కలెక్షన్లు ఉండేవి. కంటెంట్ ముందే లీక్ అయిపోయిన రూల్స్ రంజన్ లాంటి సినిమాలు ఇప్పుడు వస్తే వాటికి మంచి ప్లస్ అయ్యేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికి చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసిన వారికి ఒక మంచి డేట్ మిస్ అయిందని చెప్పవచ్చు. ఇక రక్షిత్ శెట్టి డబ్బింగ్ సినిమాపై కూడా అంతగా అంచనాలు లేవు. ఎందుకంటే ఆ సినిమాను సడన్ గా రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు