Anil Raavipudi: భగవంత్ కేసరికి ఇంకా ఆ షూట్ బ్యాలన్స్ ఉందట!

Anil Raavipudi:

ఆంధ్ర ప్రదేశ్ లో నానాటికి పులుముకుంటున్న రాజకీయ వేడి టాలీవుడ్ కి కూడా అంటుకుంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అందులో పూర్తి నిమగ్నమైపోగా, రీసెంట్ గా పాక్షికంగా నందమూరి బాలకృష్ణ కూడా బిజీ అయ్యాడు. అయితే ఇక్కడే వచ్చ్చింది పెద్ద చిక్కు. అనుకోకుండా చంద్రబాబు అరెస్ట్ తో బాలయ్య టీడీపీ బాధ్యతలను చేపట్టవలసి వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన వెంటనే విశాఖకు చేరుకొని మీటింగ్ పెట్టి కార్యక్రమాలను చేపట్టారు.

అయితే ఇక్కడ బాలకృష్ణ నటిస్తున్న సినిమాల షూటింగ్ లకు గండి పడింది. మొన్నటివరకు బాలయ్య బాబీ సినిమాల షూటింగ్ కి మాత్రమే బ్రేక్ పడిందని అందరు అనుకున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తీస్తున్న భగవంత్ కేసరి మొత్తం పూర్తి అయిందని అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం భగవంత్ కేసరి షూటింగ్ ఇంకా మిగిలే ఉందట.

ఇప్పటివరకు 85శాతానికి పైగానే షూటింగ్ జరిగినప్పటికీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక ఫైట్ సీన్ చిత్రీకరణ బాలన్స్ ఉంది అని టాక్. అయితే బాలయ్య ఒక్కరోజు కేటాయిస్తే అయిపోయే షూటింగ్ కాదిది. బాలయ్య ఇంకా పది రోజులైనా డేట్లు కేటాయిస్తే భగవంత్ కేసరి మొత్తం ఫినిష్ అయిపోతుందని మూవీ టీమ్ భావిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ డేట్లు కేటాయించడం కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు మూవీ టీం వేచి చూస్తే సరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు