Trisha Krishnan: పెళ్లి పీటలెక్కబోతున్న త్రిష

Trisha Krishnan

ఒకప్పుడు సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ గా స్టార్ హీరోలందరితో నటించిన సీనియర్ హీరోయిన్ త్రిష ఇన్నాళ్ళకి పెళ్లి పీటలెక్కబోతుందట. నాలుగు పదుల వయసు వచ్చిన ఇంకా పెళ్లి మీద ద్యాస మల్లని త్రిష మొత్తానికి ఈ ఏడాదిలో ఒక ఇంటి ఇల్లాలు అవడానికి రెడీ అయింది.

వివరాల్లోకి వెళ్తే త్రిష, మలయాళంలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఒక వ్యక్తి ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. త్రిష ఇటీవల కాలంలో నటించిన 96, పియస్ 1,2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అవడంతో ఇప్పుడిప్పుడే త్రిష మళ్ళీ మునుపటిలాగే వరుస సినిమాలతో బిజీ అవుతుంది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ట్ హీరోలైన దళపతి విజయ్ తో లియో, అజిత్ లేటెస్ట్ సినిమా మరియు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రాబోయే చిత్రం లో నటిస్తుంది త్రిష. కొద్దిరోజుల క్రితం వరకు అడపాదడపా సినిమాలతో కాలం నెట్టుకొచ్చిన త్రిష మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వరుస సినిమాలు చేయడం ఆమె అభిమానులను ఆనందానికి గురి చేస్తుంది. ఇక ఇప్పుడే కెరీర్ మళ్ళీ గాడిలో పడిన సమయంలో త్రిష పెళ్లి వార్తలు కూడా రావడంతో కోలీవుడ్ మీడియాలో ప్రస్తుతం త్రిష ట్రేండింగ్ గా మారింది.

- Advertisement -

గతంలో కూడా త్రిష పెళ్లి ఫై చాలా వార్తలు రాగ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. మరి లేటెస్ట్ గా వస్తోన్న ఈ వార్త అయిన నిజం అవుతుందో లేక రుమార్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు