Meenakshi Chaudhary :ఆ బ్లాక్ బస్టర్ కాంబో లో మీనాక్షి చౌదరి ?

Meenakshi Chaudhary

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తోన్న హీరోయిన్స్ ల పేర్లలో ఒకటి శ్రీలీల అయితే మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి అని చెప్పాలి. గతేడాది వచ్చిన హిట్-2 సినిమా సక్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ఇటీవల కాలంలో అనూహ్యంగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకొంటోంది.

ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి, మరో క్రేజి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసిందని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటా.. అని అనుకుంటున్నారా ఆ సినిమా మరేదో కాదు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా.

రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో టైగర్ నాగేశ్వర రావు సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అభిషేక్ పిక్చర్స్ పై రాబోతున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈగల్ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాల అనంతరం రవితేజ గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభమవబోతుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటుంది. అందులో భాగంగానే మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ను ఫైనల్ చేశారట. అలాగే సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం గాను మీనాక్షి చౌదరి ని తీసుకున్నట్టు సమాచారం. దీనిబట్టి చూస్తే మీనాక్షి త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యేలాగా ఉందని చెప్పవచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు