Meenakshi Chaudary: మరో క్రేజీ ప్రాజెక్ట్ లో మీనాక్షి – లక్ మాములుగా లేదు..!

Meenakshi Chaudhary

హీరోయిన్ మీనాక్షి చౌదరికి వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది. వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు ఇప్పటికే అడ్వాన్స్ లు కూడా ఇచ్చారని సమాచారం. ఇప్పటికే మీనాక్షి లైనప్ లో వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ తో మరో సినిమా ఉన్నాయి. గుంటూరు కారంలో మెయిన్ లీడ్ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలన్నీ హిట్ అయితే, మీనాక్షి త్వరలోనే టాప్ హీరోయిన్ ప్లేస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

తెలుగులో హీరో సుశాంత్ సరసన నటించిన ఇచట వాహనాలు నిలుపరాదు సినిమా ద్వారా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మీనాక్షికి మంచి గుర్తింపు దక్కింది. అప్పట్లో త్రివిక్రమ్ ఈ అమ్మడిని పొగడటంతో అందరి చూపు మీనాక్షి మీదనే పడింది. ఆ తర్వాత కిలాడీ, హిట్ వంటి సినిమాల్లో నటించింది.

- Advertisement -

కిలాడీ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ హిట్2 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో మీనాక్షి కెరీర్ ట్రాక్ లో పడింది. ప్రస్తుతం మీనాక్షి లైనప్ లో ఉన్న సినిమాలన్నీ హిట్ అయితే గనక త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ఛాన్స్ ఉందని చెప్పచ్చు. రెమ్యునరేషన్ విషయంలో టైర్ 2 హీరోల సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా ఉంది మీనాక్షి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు