Kalyan Ram’s Devil: డెవిల్ సినిమా కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో ట్రోల్స్..!

Kalyan Ram’s Devil

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం డైరెక్షన్లో డెవిల్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 24న రిలీజ్ కి సిద్ధమైంది. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్స్ ద్వారా వార్తల్లో నిలవాల్సిన ఈ సినిమా కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లో డైరెక్టర్ నవీన్ మేడారం పేరుకి బదులుగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అని నిర్మాత అభిషేక్ నామా పేరు ఉండటం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సినిమా లాస్ట్ షెడ్యూల్ సమయంలో డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో అభిషేక్ నామా డైరెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అభిషేక్ హ్యాండిల్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో ఈ ఇష్యూ మీద ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. నేనింతే సినిమాలో సీన్ ని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో చాలా సినిమాల విషయంలో కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఏ సినిమాకి  రాలేదు.

- Advertisement -

బింబిసార లాంటి సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ కి అమిగోస్ డిజాస్టర్ మిగిల్చిన నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. బింబిసార సినిమా తర్వాత సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ కలిసి నటించిన నేపథ్యంలో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. మరి, రిలీజ్ దగ్గర పడిన సమయంలో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు