Urvashi Rautela: ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్ కు మాత్రమే చేయడానికి కారణమేంటో తెలుసా ?

Urvashi Rautela

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచినా ఊర్వశి.. తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం, పాపులారిటీ ఉన్న ఊర్వశి ఐటెం భామ మాత్రమే ఉండటానికి కారణమేంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైంది ఊర్వశి రౌతేలా. చిరంజీవి పక్కన అదిరిపోయే స్టెప్స్ వేసిన ఈ బ్యూటీ అందం చూసి ఊర్వశి రౌతేలా టాలీవుడ్ పాగా వేయడం కన్ఫామ్ అని అందరు అనుకున్నారు. అయితే అంత ఊహించినట్టుగానే ఊర్వశి వరుస టాలీవుడ్ అవకాశాలతో దుసుకుపోతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఊర్వశి రౌతేలా బిజీ అవుతోంది హీరోయిన్ గా కాదు కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే. నిజానికి ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయడం ఆమె పర్సనల్ ఇష్టమని తెలుస్తోంది. ఎందుకంటే హీరోయిన్స్ కు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా ఒక ఐటెం భామలకు ఇచ్చే పారితోషికం అధికంగా ఉంటుంది.

అది కాకా హీరోయిన్ అంటే కేవలం షూటింగ్ చేస్తే సరిపోదు మూవీ ప్రమోషన్స్ బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే వర్కింగ్స్ డేస్ , అగ్రీమెంట్స్ అని రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అయితే ఐటెం సాంగ్ చేస్తే ఇవన్నీ చేయవలసిన అవసరం ఉండదు. షూటింగ్ కూడా మహా ఐతే 3,4 రోజుల లోపే కంప్లిట్ అవుతుంది. ఇక రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. అందుకే ఊర్వశి రౌతేలా తనకు హీరోయిన్ గా పలు అవకాశాలు వస్తోన్న కూడా వాటిని అంగీకరించటం లేదట. కేవలం సాంగ్స్ చేయటానికి మాత్రమే ఈ బ్యూటీ ఒప్పుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న స్కంద సినిమాలో కల్ట్ మామా అనే ఐటెం సాంగ్ లో నటించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు