Tiger nageswara rao movie: మాస్ మహారాజా రవితేజకు బిగ్ షాక్… హైకోర్టులో కేసు

Tiger nageswara rao movie

మాస్ మహారాజా రవితేజకు తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఆంధ్ర రాబిన్ హుడ్, స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ భారీ షాక్ తగిలింది.

అదేంటంటే? ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా సాగింది. రవితేజ లుక్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. సినిమాపై హైప్ ను ఈ టీజర్ పెంచింది. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అయితే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం టీజర్ పై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతే కాదు. స్టువర్టుపురానికి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో ఒక పిల్ వేశాడు.

సెన్సార్ అనుమతి లేకుండా టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్ చేశారని, సినిమా టీజర్‌లో ఎరుకల సామాజిక వర్గాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేవాలు ఉన్నాయని పిటిషనర్ తన వ్యాజ్యంలో వివరించాడు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయితే, తమ జీవితాలపై ప్రభావం చూపుతుందని సినిమా విడుదలను ఆపేయాలని హై కోర్టును కోరాడు. ఆ వ్యాజ్యం బుధవారం విచారణకి వచ్చింది.

- Advertisement -

టీజర్ లో వాడిన కొన్ని పదాలు ఒక సామాజిక వర్గంతో పాటు స్టువర్టుపురం ప్రజలను అవమానించేలా ఉన్నాయని హై కోర్టు అభిప్రాయపడింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ చిత్ర యూనిట్ ని ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసు నాలుగు వారాలకు వాయిద వేసింది.

దీంతో సినిమా రిలీజ్ పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేది వాయిదా పడుతుందా? లేదా అనుకున్న తేదీకే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కేసు పూర్తి అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు