Jawan trailer released: జవాన్ ట్రైలర్ అరాచకం- గూస్ బమ్స్ కూడా కాదు.. ఇది అంతకు మించి..

Jawan trailer released

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం జవాన్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. భారీ బడ్జెట్ తో గౌరీఖాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నిజంగా అరాచకంగా ఉందనే చెప్పాలి. ట్రైలర్ లోని ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ లోను అట్లీ తన దర్శకత్వ భీభత్సం చూపించేసాడన్నట్టుగా ఉంది. దీపికా పదుకునే, నయనతార, ప్రియమణి సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు.

గతకొద్ది రోజులుగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమవుతున్న షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరి లో వచ్చిన పఠాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక పఠాన్ సినిమా సక్సెస్ నే కంటిన్యూ చేస్తూ, తాను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే పఠాన్ సినిమా తరువాత ఇతర బాలీవుడ్ బడా డైరెక్టర్ లు చాలా మంది షారుఖ్ ఖాన్ తో సినిమా చేయడానికి ముందుకి వచ్చిన కూడా షారుఖ్ మాత్రం కోలీవుడ్ లో తలపతి విజయ్ తో పలు సినిమాలు చేసి మ్యాసివ్ హిట్స్ అందించిన అట్లీ తోనే సినిమా చేయడానికి షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

“అనగనగ ఒకరాజు ఒకదాని తరువాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు..దాహం తో, ఆకలితో అడవిలో తిరుగుతూ ఉన్నాడు.. (నవ్వుతు)అతను చాలా కోపంగా ఉన్నాడు” అనే డైలాగ్ తో షారుఖ్ ఖాన్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూసాడనే విషయం చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. టాప్ క్లాస్ విజువల్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అలాగే ఆసక్తికరం గాను ఉంది. అట్లీ తాలూకా బిగిల్, అదిరింది సినిమాలో లాగా జవాన్ లోను షారుఖ్ ఖాన్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి రోల్ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. మొత్తంగా చూస్తే జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్ లో మరో గుర్తుండి పోయే చిత్రం అవుతుందనిపిస్తోంది. సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆకలి తీరినట్టేనని జవాన్ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు