Nayanatra On Instagram: ఇన్స్టా లోకి లేడీ సూపర్ స్టార్ – నిమిషాల్లోనే లక్షల్లో ఫాలోవర్స్..!

Nayanatra On Instagram

లేడి సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో తప్ప ప్రమోషన్స్ లో కానీ, బయట పెద్దగా కనిపించదన్న సంగతి తెలిసిందే. సినిమా సైన్ చేసే సమయంలోనే ప్రమోషన్స్ కి దూరంగా ఉంటానని తేల్చి చెప్పేస్తుందట నయనతార. ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో నయనతార ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఫస్ట్ పోస్ట్ గా తన ఇద్దరు కొడుకులను ఎత్తుకొని టైగర్ కా హుకుం బీజీఎమ్ తో రీల్ చేసిన రీల్ పోస్ట్ చేసింది. సమంత ఇంస్టాలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే 500K ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.

నయనతార ఇన్స్టాలోకి ఎంట్రీ ఇవ్వటం తన ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి కూడా ఆనందం కలిగిస్తోంది. ఎందుకంటే ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా జవాన్ సినిమా అప్డేట్స్ ని షేర్ చేస్తే సినిమాకి కాస్తైనా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -

నయనతార ఇన్స్టాలో షేర్ చేసిన ఫస్ట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ తర్వాత జవాన్హిందీ, తమిళ్ ట్రైలర్ ని పోస్ట్ చేసింది నయనతార. 500k కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న నయనతార ఇప్పటివరకు కేవలం ఐదుగురిని మాత్రమే ఫాలో అవుతోంది. భర్త విగ్నేష్, షారుఖ్ ఖాన్, అనిరుద్ తో పాటు రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ని, అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య మిషెల్ ఒబామాని ఫాలో అవుతోంది నయనతార.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు