Leo: పక్క ప్లానింగ్ తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న “దళపతి విజయ్”

Leo

కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. గత కొద్దీ రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాల వార్తలు వస్తున్న క్రమంలో.. త్వరలోనే ఈ వార్తలన్నిటికి చెక్ పెడుతూ పక్క ప్లానింగ్ తో దళపతి విజయ్ రాజకీయాల్లోకి రానున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో విడుదలబోతుంది. ఇక లియో సినిమా అనంతరం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు విజయ్. ఈ రెండు సినిమాల రిలీజ్ అనంతరం ఆయన లాంగ్ బ్రేక్ తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు.

అయితే విజయ్ సొంతగా పార్టీ పెడతాడా లేక ఆల్రెడీ తమిళనాడు లో ఉన్న ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తాడా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం చూస్తే విజయ్ సొంత పార్టీ పెట్టడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచే విజయ్ కు అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండటం వల్ల సెంట్రల్ లో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలెక్షన్ అనే ప్రక్రియ ద్వారా తన పార్టీ ని రిజిస్టర్ చేయడానికి విజయ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వస్తుంది.

- Advertisement -

ఇక దీనిబట్టి చూస్తే విజయ్ పార్టీ పెట్టి ఎదో నాలుగు రోజులు హడావిడి చేద్దామని కాకుండా పక్క ప్లానింగ్ తోనే రాజకీయాలలోకి దిగుతున్నట్టు అర్థమవుతోంది.అలాగే తమిళనాడు రాజకీయాల విషయానికొస్తే గతంలో కూడా ఇదే విధంగా స్టార్ హీరోలుగా, హీరోయిన్స్ ఆర్టిస్ట్స్ గా ఉన్న చాలా మంది ద్రావిడ రాజకీయలను ప్రభావితం చేసారు.మరీ దళపతి విజయ్ కూడా వాళ్లలాగే తమిళనాడు రాజకీయాలను శాసిస్తాడా లేదా అనేది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు