Samantha: నాగచైతన్య కంటే ముందే సమంత ఆ హీరోతో ప్రేమలో పడిందా..?

Samantha

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతను జనాలు ఎలా లైక్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సమంత. ఈమె నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావే సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్ కి అవకాశాలు ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తన పేరుని మారుమోగిపోయేలా చేసుకుంది సమంత.

అయితే ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మనస్పర్ధలు వచ్చి నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా సమంత గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. ఈమె నాగచైతన్య కంటే ముందే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. అవును రజినీకాంత్ ని సమంత ప్రేమించింది కానీ రియల్ లవ్ కాదు.. అందరిలాగే సమంత కూడా రజనీకాంత్ వీరాభిమాని. సమంత ఇండస్ట్రీలోకి రాకంటే ముందే రజనీకాంత్ ని చూడాలని ఎంతగానో ఆశపడేదట

అంతేకాదు రజనీకాంత్ పై ఎంతగానో ప్రేమ పెంచుకొని ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో తన ఇంట్లో గోడలకు అంటించుకునేదట. ఇంట్లో మాత్రమే కాకుండా బెడ్ రూమ్ లో రజనీకాంత్ కి సంబంధించిన ఫోటోలు పెట్టుకునేదట సమంత. అయితే ఈ ప్రేమ ఓ విధమైన ఆరాధనలాంటిది. అలా సినిమాలలోకి రాకముందే రజనీకాంత్ ని సమంత ప్రేమించిందట. ఇక ఇండస్ట్రీకి వచ్చాక ఒక్కసారైనా ఆయనతో నటించాలనుకున్న ఆమె కోరిక ఇప్పటికీ నెరవేరలేదట. మరి భవిష్యత్తులో రజనీకాంత్ తో కలిసి సమంతకు నటించే అవకాశం వస్తుందా లేదా అనేది తెలియదు. ప్రస్తుతం సమంత ప్రేమకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు