Leo movie: లియో ఆఫర్‌ను రిజెక్ట్ చేయడంపై విశాల్ రియాక్షన్..

Leo movie

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న లియో సినిమా అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విజయ్ దళపతి, త్రిషతో పాటు అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ లాంటి స్టార్ కాస్ట్ ఉండంటంతో ఈ సినిమా ఒక కోలీవుడ్‌లోనే కాదు, అన్ని భాషల్లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉంది. అయితే ఈ సినిమాలో ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రపై ఒక వీడియో రిలీజ్ చేశారు.

హరోల్డ్ దాస్ అంటూ అర్జున్‌ని పరిచయం చేసింది లియో టీం. గ్లింప్స్ ఆఫ్ హరోల్డ్ దాస్ అనే పేరుతో రిలీజ్ అయిన టీజర్ లో అర్జున్ ను అత్యంత భయంకరంగా చూపించారు. విజయ్ ని ఢీ కొట్టబోయే పాత్రలో అర్జున్ కనిపిస్తున్నాడని తెలుస్తోంది. అయితే హరోల్డ్ దాస్ పాత్ర కోసం ముందుగా విశాల్ ని సంప్రదించారట లోకేష్ కనగరాజ్. కొన్ని రోజుల క్రితం లియో సినిమాలో విశాల్ నటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.

అయితే లియో ఆఫర్ పై, దాన్ని ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో అన్న దానిపై హీరో విశాల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. హరోల్డ్ దాస్ పాత్ర గురించి తనకు లోకేష్ కనగరాజ్ చెప్పారని, పాత్ర, స్టోరీ రెండు కూడా చాలా నచ్చాయని అన్నారు. అయితే తనకు ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల లియో చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. కాగా, విశాల్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న మార్క్ ఆంటోని చిత్రం ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు