Vijay’s Leo: అనిరుధ్ విశ్వరూపం – ఫ్యాన్స్ కి పూనకాలే..!

Vijay’s Leo

తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో లియో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో థర్డ్ పార్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా గ్లిమ్ప్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచగా ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడని అనౌన్స్ చేసిన నేపథ్యంలో సినిమాకి మరింత  హైప్ వచ్చింది.

అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న మరో అప్డేట్ ఫ్యాన్స్ లో -సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒకే ఒక్క సాంగ్ ఉండగా 24 బ్యాక్గ్రౌండ్ బిట్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉండనున్నాయో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన నేపథ్యంలో లియో సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, అసలు ఆ సినిమాలతో లియో స్టోరీకి ఎలాంటి లింక్స్ ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

- Advertisement -

అయితే, టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు అక్టోబర్ 19 సరైన డేట్ కాదని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అక్టోబర్ 19న భగవంత్ కేసరి, 20న టైగర్ నాగేశ్వరావు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో లియో సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించే ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. మరి, ఓ మోస్తరు హిట్ కావాల్సిన జైలర్ సినిమాను తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ చేసిన అనిరుధ్ విజయ్ ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు