Ram charan: గేమ్ ఛేంజర్ కి కొత్త కాదు.. మరి దిల్ రాజు ఏం చేస్తున్నట్టు?

Ram charan:

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న చిత్రాల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే సినిమా మొదలైనప్పటినుండి ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ నుండి లీక్ అయిన ఒక సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిందన్న సంగతి తెలిసిందే. కానీ ఈ పాట ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోగా, లిరిక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై ఫైర్ అవుతున్నారు. ఒక రకంగా సాంగ్ బాగాలేదన్న విషయం పక్కన పెడితే, గేమ్ ఛేంజర్ కి లీకుల బెడద ముందు నుండే ఉంది.

రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన చాలా లుక్స్ ఈ సినిమా లొకేషన్స్ నుండి లీక్ అయ్యాయి. అంతే కాదు రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ లుక్స్ మేకింగ్ కూడా అప్పట్లోనే లీక్ అయ్యాయి. ఇప్పుడు సాంగ్ లీక్ అవడంతో, నిర్మాత దిల్ రాజు అంత అజాగ్రత్తగా ఎలా వ్యవహరిస్తున్నాడన్నది ప్రశ్న గా మారింది. ఎందుకంటే శంకర్ లాంటి బడా డైరెక్టర్ తీస్తున్న సినిమాకే ఇలా లీకులవుతున్నాయంటే దగ్గరుండి చూసుకోవాల్సిన దిల్ రాజు మినిమం సెక్యూరిటీ లేకుండా ఎలా షూట్ చేయిస్తున్నారన్నదే ప్రశ్న.

- Advertisement -

ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా దానికి బాధ్యులు దిల్ రాజునే అయ్యే అవకాశం ఉంది. ఇక సాంగ్ ఎలాగో లీక్ అయింది కాబట్టి ఆ సాంగ్ నే ఫస్ట్ లిరికాల్ సాంగ్ గా కొంచెం లిరిక్స్ మార్చి రిలీజ్ చేస్తే జరిగిన డ్యామేజ్ కాస్త తగ్గే అవకాశం ఉందని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు