DilRaju: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఇదీ సంగతి?

DilRaju:

అప్డేట్ ఇవ్వండ్రా..? అంటే.. గేమ్ ఛేంజర్ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇచ్చారో చూడండి..!

టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోల సినిమాల నుండి ఎప్పటికప్పుడు సినిమాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ కి సంబంధించి డిలే అవుతున్నా, ఆయా స్టార్ హీరోల ఫస్ట్ లుక్స్, టీజర్స్ గాని, సాంగ్స్ పై గాని ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ హడావిడి చేస్తూ ఉన్నారు… ఒక్క రామ్ చరణ్ మూవీకి తప్ప!

అవును. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వం లో “గేమ్ ఛేంజర్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఎప్పుడో 2021 లో లాంచ్ అయిన ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇండియన్2 వల్ల అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ చేస్తున్నప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా నుండి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. పైగా సినిమా సమ్మర్ రిలీజ్ డేట్ కూడా చెప్పడం లేదు. ఇక నిర్మాత దిల్ రాజు మాత్రం సినిమా షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తయిందని అంటున్నా ఫ్యాన్స్ నమ్మడం లేదు.

- Advertisement -

అయితే చాలా రోజుల తర్వాత మేకర్స్ నుండి గేమ్ ఛేంజర్ పై ఒక అప్డేట్ ఇచ్చారు. అది చూసిన చరణ్ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. అప్డేట్ ఇవ్వకపోతే తిడతారు గాని.. ఇస్తే తిట్టడమేంటి అనుకుంటున్నారా…

అసలు విషయానికొస్తే సెప్టెంబర్ చివరి వారం లో గేమ్ ఛేంజర్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. అయితే ఆ మూవీ లోని కొందరు ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ షెడ్యూల్ ని వాయిదా వేసి అక్టోబర్ రెండో వారంలో చేస్తామని సోషల్ మిడియా ద్వారా చెప్పడం జరిగింది. ఇది చూసిన చరణ్ ఫ్యాన్స్ అప్డేట్ ఇవ్వమని అంటే ఇలాంటి అప్డేట్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దిల్ రాజుని ట్రోల్ చేయడం మొదలెట్టారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు