Ram Pothineni: ‘నరుకుడు’ సినిమాకి సర్టిఫికెట్ వచ్చేసింది..!

Ram Pothineni:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘స్కంద’ ఒకటి. ఉస్తాద్ రామ్ పొతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక స్కందను ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేద్దామనుకున్న చిత్ర యూనిట్ హిందీలో కూడా పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయి, ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే, రామ్ లుక్స్ చూసి ఇది పూర్తిగా బోయపాటి స్టైల్ లో తెరకెక్కుతోందని ఆడియన్స్ కి అర్ధమైపోయింది. స్కంద సినిమాలో శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించగా, శ్రీకాంత్, ప్రిన్స్, రాజా, గౌతమి, ఇంద్రజ, తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఇక స్కంద టీజర్, ట్రయిలర్స్
రిలీజ్ అయి, ఫ్యాన్స్ దృష్టిలో సినిమాపై అంచనాలు పెంచేయగా, కామన్ ఆడియన్స్ లో మాత్రం పెద్దగా బజ్ తీసుకురాలేకపోయింది. దాంతో చాలా మంది స్కంద రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టే వెళదామని ఫిక్స్ అయ్యారని అనిపిస్తుంది.

ఇక తాజాగా స్కంద సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. హింసాత్మక సన్నివేశాలతో, సింపుల్ గా చెప్పాలంటే నరుకుడు కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఒక రకంగా ఇది మంచిదే అని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన లెజెండ్ సినిమాకి అప్పట్లో సెన్సార్ బోర్డు క్లీన్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. అలాంటిది ట్రైలర్ లోనే విలన్లను నరకడమే చూపించిన ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ రావడం గ్రేటే. అయితే స్కంద బాక్స్ ఆఫీస్ వద్ద జనాల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు