Tumbbad ReRelease Collections : బాలీవుడ్ లో గత రెండు వారాలుగా పెద్దగా అంచనాలున్న సినిమాలేవీ రిలీజ్ కాకపోగా, ఈ వారం మాత్రం ఒక కల్ట్ హర్రర్ సినిమా రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ ట్రెండ్ బాలీవుడ్ లో పెద్దగా లేకపోయినా, ఈ సినిమా మాత్రం హిందీలో అదిరిపోయే వసూళ్లు సాధిస్తుంది. ఆ సినిమా పేరే “తుంబాడ్”. ఏడేళ్ల కిందట అనగా 2018 లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ నుంచి మంచి రివ్యూలు తెచ్చుకుంది. కానీ థియేటర్లలో కలెక్షన్స్ పరంగా అంతగా అంచనాలను అందుకోలేకపోయింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయి కల్ట్ హర్రర్ మూవీ స్టేటస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ చేయాలనీ డిమాండ్ ఎన్నో రోజులుగా ఉండగా, తాజాగా “తుంబాడ్” (Tumbbad Re Release) సినిమా ఈ వారం మళ్ళీ రీ రిలీజ్ అయింది.
రీ రిలీజ్ లో తుంబాడ్ కి అదిరిపోయే కలెక్షన్స్..
ఇదిలా ఉండగా తుంబాడ్ సినిమా ఈ వారం సెప్టెంబర్ 13న థియేటర్లలో రీ రిలీజ్ కావడం జరిగింది. ఇక అప్పట్లో రిలీజ్ అయినప్పుడు అంతగా పట్టించుకోని ఆడియన్స్, ఇప్పుడు రీ రిలీజ్ అయ్యాక మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు సాధించిన 1.65 కోట్ల కలెక్షన్స్ ని అందుకోగా, ఆ తర్వాత ఒకరోజుని మించి మరో రోజు వీకెండ్ లో సత్తా చాటింది. రెండో రోజు తుంబాడ్ 2.65 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా, మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో ఏకంగా 3.04 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా మాస్ రచ్చ చేసిందని చెప్పాలి.
30 కోట్ల వసూళ్లు అందుకునే ఛాన్స్..
ఇక ఈ హర్రర్ సినిమాకి రిలీజ్ అయినపుడు ఆదరించిన దానికి పది రెట్లు మించి ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పాలి. తుంబాడ్ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 25-30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక థియేటర్లలో దేవర రిలీజ్ అయ్యే దాకా ఈ సినిమా కలెక్షన్లు కొనసాగే అవకాశం ఉంది. మరి తుంబాడ్ ఓవరాల్ గా ఎంత వరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.