Stree 2 : బాలీవుడ్ లో సరిగ్గా నెలరోజుల కిందట రిలీజ్ అయిన దెయ్యం సినిమా స్త్రీ2 ఊహించని వసూళ్లు సాధిస్తూ, పలు రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు నుండే పాన్ ఇండియా సినిమా రేంజ్ లో బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధిస్తుంది. ఇక ఈ ఇయర్ హిందీలో విడుదలైన సినిమాల్లో అంచనాలను అందుకున్న స్టార్ హీరో సినిమా ఒక్కటీ లేకపోగా, హర్రర్ సినిమాగా విడుదలైన “స్త్రీ2” భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) మెయిన్ లీడ్ గా నటించిన విషయం తెలిసిందే. హారర్ మూవీగా తెరకెక్కిన “స్త్రీ2” గతంలో వచ్చిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
అరుదైన రికార్డ్ అందుకున్న స్త్రీ2..
ఇక ఇప్పటికే స్త్రీ2 సినిమా ఇండియాలో 600 కోట్ల మార్క్ ని అందుకోగా, తాజాగా మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. అదేంటంటే బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద 5వ వీకెండ్ లో విడుదలైన సినిమాల్లో బాలీవుడ్ లో బాహుబలి2 (Bahubali2) 12 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా, 5 ఏళ్ల క్రితం వచ్చిన “ఉరి” (URI The Surgical Fight) మూవీ 12.40 కోట్ల కలెక్షన్స్ ని ఇండస్ట్రీ రికార్డ్ ను కొట్టింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఏ పాన్ ఇండియా సినిమా బ్రేక్ చేయలేదు. కానీ ఒక దెయ్యం సినిమాగా వచ్చిన స్త్రీ2 ఐదో వారం లో ఏకంగా 16 కోట్ల వసూళ్లు అందుకుని రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకు కూడా సాధ్యం కాలేదని చెప్పాలి.
800 కోట్ల మార్క్ అందుకున్న స్త్రీ2..
ఇక ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న స్త్రీ2 (Stree2) సినిమా 2024 లో అత్యధిక వసూళ్లు సాధించగా, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏకంగా 800 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవడం విశేషం. ఇక ఓవరాల్ గా దేవర (Devara) వచ్చే వరకు ఈ సినిమా వసూళ్లు కొనసాగే ఛాన్స్ ఉంది. మరి ఓవరాల్ గా మరో 20 కోట్ల వరకు స్త్రీ2 కలెక్షన్స్ అందుకనే ఛాన్స్ ఉందని చెప్పాలి.