Malavika Mohanan.. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రంగుల ప్రపంచంలో తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అయితే నటించడం వరకు ఓకే కానీ కొన్ని ఇంటిమేట్ సీన్ లలో కూడా నటించాల్సి వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెరపై ముద్దు సన్నివేశాలు, శృంగార భరిత సన్నివేశాలలో నటించడం అంటే నటీనటులకు అత్యంత కష్టతరమైన పని. అయితే తప్పని పరిస్థితుల్లో శృంగార భరిత సన్నివేశాలలో నటించాల్సి వస్తే, ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు అని చెబుతోంది ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ ( Malavika mohanan).
సాథియా పాటలో లిప్ లాక్ తో రెచ్చిపోయిన మాళవిక..
తెలుగు, తమిళ్ భాషలో నటించి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె తాజాగా సిద్ధాంత్ చతుర్వేది( Siddhanth chaturvedi) అనే ఒక యంగ్ హీరోతో కలిసి యుధ్రా (Yudra )అనే హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచీ సాథియా అనే పాట తాజాగా విడుదల అవ్వగా ఇందులో మాళవిక, సిద్ధాంత్ ఘాటైన రొమాన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇందులో ఘాటైన లిప్ కిస్ తో పాటు అంతకుమించి రొమాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సన్నివేశాలలో తాను ఎలా నటించాను అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది మాళవిక. .
కోఆర్డినేటర్ తప్పనిసరి..
సాధారణంగా అన్ని సినిమాలలో.. అందరి ముందు ఇలా శృంగార భరిత సన్నివేశాలలో నటించాల్సి వచ్చినప్పుడు ఇంటిమేట్ కోఆర్డినేటర్ అనే వ్యక్తి సెట్ లో ఉంటారట. ఈ కోఆర్డినేటర్ దగ్గరుండి ఇలా చేయండి , అలా చేయండి అంటూ ఆ సీన్లు సరిగా వచ్చేవరకు పూర్తి బాధ్యత వహిస్తారట. కానీ యుధ్ర సినిమా షూటింగ్ సమయంలో అలాంటి కోఆర్డినేటర్ లేకపోవడం వల్ల ఎంతో కష్టపడ్డామని ఆమె చెప్పుకొచ్చింది.
ఫ్రెండ్లీనెస్ వుంటే ఇంటిమేట్ సీన్స్ కి ఇబ్బంది ఉండదు..
ఎముకలు కొరికే చలిలో ఒక బీచ్ లో ఆ సన్నివేశాలు చిత్రీకరించారు. సిద్ధాంత్ తో నాకు ఏర్పడిన ఫ్రెండ్లీనెస్ కారణంగానే ఎలాంటి కోఆర్డినేటర్ లేకుండా ఈ సీన్లలో నటించాను. సరైన డైరెక్టర్, హీరోతో మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్లలో నటించడం సులభం అవుతుంది అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్. మొత్తానికైతే ఆ సినిమా హీరో డైరెక్టర్ తో తనకు ఉన్న కారణంగానే కోఆర్డినేటర్ లేకపోయినా తాను ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇంటిమేట్ సన్నివేశాలలో నటించాలని తెలిపింది.
మాళవిక సినిమాలు..
మాళవిక మోహనన్ కెరియర్ విషయానికి వస్తే, 2013లో మలయాళం లో వచ్చిన పట్టం పోల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించింది. 2020లో చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఐదవ స్థానం దక్కించుకున్న ఈమె గ్లామర్ షో చేస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి మారుతీ డైరెక్షన్లో వస్తున్న ది రాజా సాబ్ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది మాళవిక.