Bigboss Season7: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడు?

Bigboss Season7:

తెలుగు బుల్లి తెర మీద బిగ్ బాస్ సీజన్ 7 హుంగామా మూడు వారాలు విజయవంతంగా కంప్లీట్ అయ్యి నాలుగో వారంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ ఉల్టా పల్టా సీజన్ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ జాగ్రత్తగా ఆడాల్సి వస్తుంది. ఫస్ట్ వీక్ అందరూ లైట్ తీసుకున్నప్పటికీ సెకండ్ వీక్ నుండి అసలు ఆట షురూ అయిందని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ షో లో ఇద్దరు కంటెస్టెంట్స్ లేడీస్ ఎలిమినేట్ అవగా, ఈ వారం కూడా లేడీసే ఎలిమినేట్ అవడం గమనార్హం.

అయితే బిగ్ బాస్ లో గత సీజన్ల లో వైల్డ్ కార్డు ద్వారా కొందరు కంటెస్టెంట్స్ మధ్యలో నుండి కూడా ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. నవదీప్, దీక్షా పంత్, నందిని రాయ్, శిల్పా చక్రవర్తి లాంటి వాళ్ళు ఇంతకు ముందు సీజన్లలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారే. వీళ్ళెవ్వరూ బిగ్ బాస్ కప్ దక్కించుకోలేదు. కానీ నవదీప్ మాత్రం ఫైనల్ వరకు వెళ్ళొచ్చాడు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళకి కప్ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయి మూడు వారాలు అయినా ఇప్పటివరకు వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవ్వరూ ఇవ్వలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మరో రెండు వారాల పాటు వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండదని టాక్ నడుస్తుంది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. మరి చూడాలి ఆ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడో?

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు