Divyansha Kaushik : దివ్యాంశ కౌశిక్ ను వరించిన ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ?

Divyansha Kaushik

నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాతో టాలీవుడ్ కు పరిచమైన దివ్యాంశ కౌశిక్ కు గురించి అందరికి తెలిసిందే. అందం, అమాయకత్వం కలగలిసినట్టు ఉండే ఈ బ్యూటీ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసును దోచేసింది. కానీ కాలం కలిసి రాకా ఇటీవల కాలంలో దివ్యంశ కౌశిక నటించిన సినిమాలు ఆశించినంత విజయం సాధించటం లేదు. దాంతో ఈ హీరోయిన్ కు ఆఫర్స్ కరువయ్యాయి.

ఈ ఏడాది మొదట్లో సందీప్ కిషన్ మైఖేల్, సిద్దార్థ్ తో టక్కర్ సినిమాలతో దివ్యాంశ కౌశిక్ ప్రేక్షకులను పలకరించిన హిట్ మాత్రం ఈ హీరోయిన్ ను కనికరించలేదు. ఇక లేటెస్ట్ గా చూస్తే దివ్యాంశ కౌశిక్ ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్, హీరో కాంబినేషన్ లో రాబోతున్న ఒక భారీ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిందని ఓ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.

అయితే మరి దివ్యాంశ కౌశిక్ ను వరించిన ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఏంటా అనుకుంటున్నారా.. ఆ కాంబినేషన్ మరేదో కాదు. మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని లదీ. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. ఇక ప్రస్తుతం మైత్రి మూవీస్ బ్యానర్ పై వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టీం ప్రస్తుతం హీరోయిన్స్ వేటలో ఉన్నట్టు టాక్. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ నటించేందుకు దివ్యాంశ కౌశిక్ ను సంప్రదించారని సమాచారం అందుతోంది.

- Advertisement -

ఇంతకు ముందు కూడా దివ్యాంశ కౌశిక్ రవితేజ తో కలిసి రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాలో రవితేజ దివ్యాంశ కౌశిక్ పెయిర్ కు ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.కానీఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా మరోసారి రవితేజ కలిసి నటించబోతున్న దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాతోనైన హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు