శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా 2019 ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ” మజిలీ”. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
తెరపై తన అందం, హవా భావాలతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత టక్కర్ మూవీతో కోలీవుడ్ లో అరంగేట్రం చేసింది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ మాస్ మహారాజా రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగచైతన్య సమంతతో విడిపోయిన తరువాత ఆయన లైఫ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
Read More: Meenakshi Chaudhary: హిట్2 బ్యూటీ ఎట్టకేలకు ఛాన్స్..
ఇటీవల దివ్యాంశ కౌశిక్ తో కూడా నాగచైతన్య ప్రేమాయణం నడుపుతున్నాడని ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ పై స్పందించింది దివ్యంశ కౌశిక్. తనకి చైతన్య అంటే ఇష్టమేనని.. కానీ పెళ్లి చేసుకోబోతున్న వార్తలలో మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.
“నాగచైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ చైతు. అతడు చూడడానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ కూడా ఉంది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీ లో నాకు ఛాన్స్ రావడానికి చైతునే కారణం అంటూ వచ్చిన రూమర్స్ లో కూడా నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో చైతు – దివ్యాంశ మధ్య ప్రేమాయణం ఉందని గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తల్లో నిజం లేదని నేటితో తెలిపోయింది.
Read More: Bigboss7: ఆ తప్పు వల్లే ఉదయభాను కెరీర్ నాశనమైందా..!
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...