Kavya Thapar: ఇస్మార్ట్ ఆఫర్ కొట్టేసిన కావ్య థాపర్

Kavya Thapar

సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఏక్ మినీ కథ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ గురించి అందరికి తెలిసిందే. కరోనా కారణంగా ఓటిటిలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల విందు చేసిన హీరోయిన్ కావ్య థాపర్ లేటెస్ట్ గా ఒక బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఓ వార్త వినిపిస్తోంది.

అయితే ఆ బంపర్ ఆఫర్ ఏంటా అని అనుకుంటున్నారా.. హీరోయిన్ కావ్య థాపర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందట. ఇప్పటికే కావ్య థాపర్, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఉండే కొన్ని సీన్స్ షూట్ కూడా చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

ఇటీవలనే బిచ్చగాడు 2 సినిమాలో నటించిన ఈ భామ మొదటి థియేటర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ తో కలిసి ఊరు పేరు భైరవ కోన సినిమాలోను కావ్య థాపర్ నటిస్తోంది. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

- Advertisement -

కావ్య థాపర్ ఈ విధంగా ఒక సినిమా హిట్ కొట్టి, మరో సినిమా రిలీజ్ కు రెడీ గా ఉండగానే పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మక చిత్రం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమె నటించడం ప్రస్తుతం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా గుర్తింపు లేని ఈ నటిగా ఉన్న కావ్య థాపర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుండటం చూస్తే త్వరలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ప్లేస్ కన్ఫామ్ అయ్యేటట్టే ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు