Vijay antony : మహేష్ బాబుని బిచ్చగాడు హీరో అంత మాట అన్నాడేంటి ?

2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తమిళ్ లో మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగా నటించారు. తెలుగులో డైరెక్టర్ అవ్వాలని వచ్చి హీరోలు అయిన వాళ్ళు ఉన్నట్టు, తమిళ్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్లు గా వచ్చి హీరోలుగా చేస్తున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. విజయ్ ఆంటోనీ ఈ కోవకి చెందినవాడే. కెరీర్ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆంటోనీ నాన్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో ఈ సినిమాని నకిలీ పేరుతో డబ్ చేసారు. తెలుగులో కూడా ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. దాంతో తమిళ్ లో హిట్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాలు తరుచుగా తెలుగులో డబ్ అవుతూండేవి అలా వచ్చిన సినిమానే బిచ్చగాడు.

అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ బిచ్చగాడు సినిమా పెద్ద హిట్ అవడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా పార్ట్ 2 తీశారు. ఈ సినిమాకి విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించారు.ఇటీవలనే సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల చేయగా , అద్భుతమైన విజువల్స్ తో ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. దాంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీం బిజీ గా ఉంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన హీరో విజయ్ ఆంటోనీ ని “బిచ్చగాడు సినిమాలో మీరు హీరో కాకుండా వేరే హీరోతో చేయాల్సి వస్తే ఎవరితో చేసుండేవారు” అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన “ఈ సినిమాలో నేను కాకుండా వేరే హీరోగా అంటే నేను మహేష్ బాబుతో చేసేవాడిని, బిచ్చగాడు క్యారెక్టర్ ని మహేష్ అయితే కరెక్ట్ గా చేస్తాడు” అని ఆయన అన్నారు. విజయ్ ఆంటోనీ మహేష్ ని బిచ్చగాడు రోల్ కి సెట్ అవుతాడు అని చెప్పగానే అందరు షాక్ అయ్యారు. అయితే ఇది మనసులో మాటా కాదని ప్రమోషన్ కోసం మహేష్ పేరు తీసాడని అందరు అభిప్రాయ పడుతున్నారు

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు