Raviteja :టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇవ్వనున్న త్రిష

నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులో హీరోయిన్ పరిచయమైన త్రిష, ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాతో అందరి మనసు గెలుచుకుంది. వర్షం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో త్రిషకి తెలుగు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. దాంతో అతి తక్కువ సమయంలోనే త్రిష టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది.

కొన్నేళ్ల పాటు తెలుగులో హిట్స్, సూపర్ హిట్స్ తో సాగిన ఈమె కెరీర్ కి ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాతో బ్రేక్ పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై ప్లాప్ గా నిలిచింది. అసలే ఆ మధ్య అడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్న త్రిషకి దమ్ము సినిమా ప్లాప్ తరువాత తెలుగు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ తరువాత ఆమె బాలకృష హీరోగా నటించిన లయన్ సినిమాలో నటించింది. ఈ సినిమానైనా ఆమె కెరీర్ ని మళ్ళీ మలుపు తిప్పుతుందేమో అనుకుంటే లయన్ కూడా త్రిషకి నిరాశనే మిగిల్చింది. ఇక ఆ సినిమాతో త్రిష తెలుగు సినిమాలకి బాయ్ బాయ్ చెప్పి తమిళ్ సినిమాలతో బిజీ అయిపొయింది.

అయితే ఇన్నాళ్ళకి త్రిష మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఆమె తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ్ సినిమాలలో బిజీ గా ఉన్న ఈమె త్వరలోనే తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతోందని వార్త వినిపిస్తుంది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా ప్లానింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోబోతున్నారంట. PS2 ప్రమోషన్స్ వచ్చినపుడే ఈ సినిమాకి సంబంధించి చర్చలు కూడా జరిగయని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు