Varun Tej :మెగా ఫ్యామిలీ లో పెళ్లి భాజా ?

మెగా ఫ్యామిలీలో తొందరలోనే పెళ్లి గంటలు మోగబోతున్నాయనే వార్త గట్టిగ వినిపిస్తుంది. అది కూడా వచ్చే నెలలోనే ఈ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందంట. మరి పెళ్ళికొడుకు ఎవరో తెల్సా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,  వధువు మరెవరో కాదు ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠి. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారిగా నటించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ బాగ క్లోజ్ అయ్యారంట. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్త. ఈ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమా చేసారు. ఘాజి సినిమా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంశలు వచ్చాయి కానీ కలెక్షన్లే రాలేదు.

ఇలా వీరిద్దరూ చేసిన సినిమాలు సక్సెస్ అవ్వలేదు కానీ వీళిద్దరి ప్రేమ మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి.గత కొద్దీ కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట వచ్చే నెలలో (జూన్) పెళ్లి పీటలెక్కబోతున్నారంట. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. మరో పక్క లావణ్య కూడా పలు ప్రాజెక్ట్స్ లతో బిజీ గా ఉండగా.. వీళ్ళ పెళ్లిని గత కొద్దీ రోజులుగా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారంట. అయితే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారని టాక్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు