RRR :రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఒకప్పుడు రామ్ చరణ్ ని ఏ బాలీవుడ్ మీడియా అయితే ట్రోల్ చేసిందో ఇప్పుడే అదే బాలీవుడ్ మీడియా తరుచుగా రామ్ చరణ్ నామస్మరణ చేస్తున్న న్యూస్ రోజుకో రకంగా చూస్తూనే ఉన్నాం.అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది.

RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని ఎంటర్టైన్ చేసిన రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి నడవడిక, క్రమ శిక్షణతో అందరిచేత ప్రశంశలు అందుకుంటున్నాడు. ఒకప్పుడు చిరంజీవి వారసుడు అనే ట్యాగ్ కొన్నాళ్ళు మోసిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఇక విషయానికొస్తే రామ్ చరణ్ గతంలో జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఇచ్చాడు. ఈ సినిమా బాలీవుడ్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన జంజీర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. 2013 లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా ప్రియాంక చోప్రా నటించింది. ప్రస్తుతం ఆమె పలు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉండగా ఒక ఇంటర్వూ లో పాల్గొన్న ఆమె రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అంటారు దీన్ని మీరు ఒప్పుకుంటారా” అని అడగ్గానే వెంటనే ఆమె “యస్” అని సమాధానం చెబుతూ “రామ్ చరణ్ కి ఇండియాలో చాలా మంచి పేరుంది. బ్రాడ్ పిట్ ఎలాంటి వాడో నాకు తెలియదు గాని రామ్ చరణ్ మాత్రం చాలా మంచి వాడు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు