Pooja Hegde: పూజా హెగ్డే ను కరుణించిన బాలీవుడ్- ఎట్టకేలకు ఒక్క ఛాన్స్

Pooja Hegde

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఆపేసిన పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే ను ఎట్టకేలకు బాలీవుడ్ మేకర్స్ కరుణించారు. నిన్న మొన్నటి వరకు చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉంటోన్న పూజా హెగ్డే ఇటీవలనే ఒక సినిమా కమిటైనట్టు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఒక గాసిప్ హల్చల్ చేస్తోంది.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోను నటించిన పూజా హెగ్డే ను ప్రస్తుతం టాలీవుడ్ దూరం పెట్టిందన్న విషయం తెలిసిందే. దానికి కారణం ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాలన్నీ ఒకటి మించి ఒకటి ఫ్లాప్ అవుతుండటమే ! ఇక టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవటంతో బాలీవుడ్ చెక్కేసింది ఈ బ్యూటీ. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ తో కిసీకి భాయ్ కిసీకా జాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా గనక హిట్ అయితే ఇక బాలీవుడ్ లో పాగా వెయ్యడం కన్ఫామ్ అనుకుంది పూజా హెగ్డే కానీ అలా జరగలేదు.

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పూజా హెగ్డే కు బాలీవుడ్ లోను అవకాశాలు లేకుండా పోయాయి. మరో పక్క టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా గుంటూరు కారం నుంచి కూడా ఆమెను తప్పించడంతో పూజా హెగ్డే కెరీర్ అయోమయం లో పడిపోయింది.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా వస్తోన్న వార్తల ప్రకారం మలయాళ దర్శకుడు ఆండ్రూస్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్ కు జోడిగా నటించడానికి పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తునట్టు టాక్. మరీ ఈ సినిమా గనక పూజా హెగ్డే కు ఓకె అయితే ఆమె కెరీర్ గట్టెక్కినట్టే అని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు