#BoyapatiRapo: బర్త్ డే రోజు థండర్ గిఫ్టిచ్చిన బోయపాటి

రామ్ పోతినేని. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. 2006 లో దేవదాసుతో చిత్రంతో అరంగేట్రం చేసి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించాడు. ఆ తర్వాత జగడం, రెడీ, మస్కా, కందిరీగ లాంటి సినిమాలతో మాస్ హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకోగా, అదే చట్రంలో ఇరుక్కోకుండా నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే లాంటి ప్రేమకథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ రోజు అనగా మే15 న రామ్ పొత్తినేని బర్త్ డే. ఈ సందర్బంగా filmify టీమ్ తరపున తనకి బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నాము.

రామ్ పొత్తినేని 1988 మే15న హైదరాబాద్ లో పుట్టాడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ అన్న మురళీ కొడుకైన రామ్, మంచి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల చిన్నవయసులోనే ఈజీ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 16ఏళ్ళకి హీరో అయిన రామ్ తన టాలెంట్ తో చక్కని నటనతో మంచి ఇమేజ్ ని, గుర్తింపుని పొందాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన మాస్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఊపేసాడు రామ్. డైరెక్టర్ పూరిజగన్నాథ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ను కూడా తీయనున్నట్టు రామ్ బర్త్ డే సందర్బంగా “డబుల్ ఇస్మార్ట్” అనే టైటిల్ తో అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి రామ్ ని ఎలా చూపిస్తాడో ఆ మధ్య విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే చెప్పాడు.

తాజాగా బోయపాటి రామ్ పొత్తినేని మూవీ యొక్క అఫిషియల్ టీజర్ ని రామ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. ఇంకా మూవీ టైటిల్ ని ఫిక్స్ చేయకుండానే టీజర్ ని “బోయపాటిరాపో” పేరుతో విడుదల చేసారు. ఒక పవర్ఫుల్ థండర్ బ్లాస్ట్ గా రిలీజైన ఈ టీజర్ బోయపాటి మార్క్ లో స్టైలిష్, మాస్ యాక్షన్ తో అద్దిరిపోయింది. దున్నపోతుల “సదర్” లో నడిచొస్తూ ఫైట్ చేసే సీన్ సినిమాలో హైలెట్ కానుందని టీజర్ చూస్తే అర్ధమైపోతుంది. రామ్ టీజర్ లో విలన్ తో చెప్పిన డైలాగులు కూడా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. అఖండ తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఇక చిత్ర నిర్మాణ విలువలు కూడా ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి.

- Advertisement -

రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను అక్టోబర్20 న దసరా కానుకగా విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు