Raviteja : ఆ ప్లాప్ డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేయబోతున్న నిఖిల్

ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం చాలు లైఫ్ మారిపోవడానికి అని అందరు అంటున్నారు. అయితే ఈ మాటలో నిజం లేకపోలేదు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల హిట్, ప్లాప్ పైనే ఆయా డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల, హీరోల జీవితాలు ఆధారపడి ఉంటాయి. సినిమా హిట్ అయితే లైఫ్ ఒకలా మారిపోతే, ప్లాప్ అయితే మాత్రం అంతే సంగతి పలకరించే మనుషులు కూడా ఉండకుండపోతారు.

ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుదీర్ వర్మ పరిస్థితి చూస్తే ఇలాగె ఉంది. స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ కొట్టి, విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ ప్రస్తుతం ఢీలా పడిపోయాడు. ఒకప్పుడు కథల విషయంలో జడ్జ్ మెంట్ లేక చేతికందొచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయిన నిఖిల్ కి స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి నిఖిల్ కెరీర్ ముగిసిపోకుండా కాపాడాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. స్వామి రారా హిట్ తరువాత నిఖిల్ కథల విషయంలో జాగ్రత్త వహించడం మొదలు పెట్టి సినిమా, సినిమాకి వైవిధ్యం కనపరుస్తూ కార్తికేయ2 సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు.

అయితే డైరెక్టర్ సుధీర్ వర్మ మాత్రం ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడే ఆగిపోయాడు. సుధీర్ వర్మ స్వామి రారా తరువాత, నాగ చైతన్యతో దోచేయ్ సినిమా చేసాడు. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో మళ్ళీ నిఖిల్ తో కేశవ సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఆ తరువాత శర్వానంద్ హీరోగా రణరంగం సినిమా చేసి మరో ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. స్ట్రయిట్ సినిమాలు వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాడేమో ఏమోగానీ రెజీనా కాసాండ్రా, నివేత థామస్ ప్రధాన పాత్రల్లో కొరియన్ సినిమా రీమేక్ గా శాకినీ ,డాకిని సినిమా చేసాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. ఇలా ఒక హిట్ పడితే రెండు మూడు ప్లాప్ సినిమాలు డెలివరీ చేసిన సుధీర్ వర్మ, రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ఇంతకు ముందు ప్లాప్ అయిన సుధీర్ వర్మ సినిమాలు కాస్తో, కూస్తో పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా రావణాసుర మాత్రం ఏ మాత్రం పాజిటివిటి లేకుండా అవుట్ రైట్ డిజాస్టర్ గా నిలిచింది.

- Advertisement -

కథ ఎంపిక, డైరెక్షన్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అందరిచేత మాటలు పడుతున్న సుధీర్ వర్మ ని ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్, హీరో నమ్మే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ సుధీర్ వర్మ నిఖిల్ తో కోలాబిరేట్ అవబోతున్నడంట. ప్రస్తుతం ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న నిఖిల్, తన కెరీర్ బిగినింగ్ లో హిట్స్ ఇచ్చిన సుధీర్ వర్మకి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నడని సమాచారం. ఈ కాంబినేషన్ పై త్వరలోనే అఫీషియల్ ఎనోన్స్ మెంట్ రాబోతుందనే వార్త వినిపిస్తోంది. ఆల్రెడీ రెండు సార్లు సూపర్ హిట్స్ కొట్టిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు