Malli pelli : నరేష్ కి ఎన్ని కోట్ల ఆస్తుందో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

టాలీవుడ్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రముఖ నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గతేడాది కాలంగా నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో నరేష్ – పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. దాదాపుగా ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉందని తెలుస్తోంది. నరేష్ ఒక సినిమాలో నటించేందుకు దాదాపుగా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అంతేకాకుండా తల్లి విజయనిర్మల నుండి నరేష్ కి పెద్ద మొత్తంలో ఆస్తి వచ్చిందట. నరేష్ స్థిర చర ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న మళ్లీ పెళ్లి సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తో గొడవలు, పవిత్ర లోకేష్ అతని జీవితంలోకి ఎలా వచ్చింది.. అన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నరేష్. ఈ ట్రైలర్ లో నరేష్ అసిస్టెంట్ “మీకేంటి సార్ 1000 కోట్ల ఫిగర్” అనే డైలాగ్ చెప్తుంటాడు. నిజ జీవితంలో నరేష్ ఆస్తుల విలువ అంచనా వేసే ఈ డైలాగ్ అని తెలుస్తుంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు