Pushpa2 : అనసూయ ఆస్తులు ఎంతో తెలుసా ?

బుల్లితెర యాంకర్ అనసూయ…ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బుల్లితెర యాంకర్ గా, గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ ఆనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె తాజాగా ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధిస్తే అనసూయ క్రేజ్ మరో లెవెల్ కి వెళుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే సినిమాలు, బుల్లితెర షోల ద్వారా ప్రేక్షకులను బాగా అలరిస్తున్న ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్ల వల్ల ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది. ఇంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీ సంపాదించుకున్న అనసూయ జబర్దస్త్ షోకి రెమ్యూనరేషన్ ఏడాదికి రూ. 70 లక్షలు అందుకుంటున్నట్టుగా సమాచారం. మిగిలిన షోలకి ఒక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయల వరకు అందుకుంటుందట. ఇక సినిమాలకైతే ఒక రోజుకు రూ.1.5 లక్షలు అందుకుంటుందట. ఆడియో ఫంక్షన్,ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే… రూ.5 లక్షల వరకు అందుకుంటుందట. అనసూయకి హైదరాబాదులో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దాని విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందట. అనసూయ దగ్గర రెండు కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.1.5 కోట్లు. అనసూయ ఆస్తి విలువ సుమారుగా రూ.70 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. కాగా ఇప్పుడు..అనసూయ జబర్దస్త్ చేయడం లేదన్న విషయం తెలిసిందే.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు