Aishwarya Rajesh :అలా చేస్తేనే తెలుగులో అవకాశాలు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి తెలియని వారండరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కూడా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది. ప్రముఖ సీనియర్ నటి లక్ష్మీ మేనకోడలే ఐశ్వర్య రాజేష్. రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాలలో నటించింది. కానీ ఈ సినిమాలు ఒక సినిమా తర్వాత మరొకటి ప్లాప్ అయ్యాయి.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐశ్వర్య రాజేష్ కి సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదని చెప్పాలి. ఇది ఇలా ఉండగా, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని… కేవలం ముంబై నుంచి వచ్చిన అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఇస్తారని ఓ టాక్ ఉంది. అయితే దీనిపై గతంలో చాలామంది తెలుగు అమ్మాయిలు నోరు విప్పారు. కాగా, తాజాగా ఐశ్వర్య కూడా ఘాటుగానే స్పందించింది. ఆమె నటించిన ఫర్హనా మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ… “నేను తెలుగు అమ్మాయినే. అయినా కూడా నాకు తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగులో నటించాలంటే తెల్లగా, సన్నగా ఉండి, గ్లామర్ షోలు చేయాలి. మనకు సెట్ కాదులే అని ఇక్కడ అవకాశాలు వెతకడం ఆపేశాను”  అంటూ చెప్పుకొచ్చింది. దర్శకులకు అన్ని నచ్చేలా చేస్తేనే…ఇక్కడ చాన్స్ వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసింది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు