Game Changer: శంకర్ మీద ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం “గేమ్ చేంజర్”. ఎప్పుడో రెండిళ్లకిందట స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను శ్రీ వెంటకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ “గేమ్ చేంజెర్” సినిమా హీరోగా రామ్ చరణ్ కి, అటు డైరెక్టర్ గా శంకర్ కి 15వ సినిమా కావడం విశేషం. ఇక నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. శ్రీకాంత్, జయరాం, ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర, ప్రియదర్శి, సునీల్, రాజీవ్ కనకాల, సముద్ర ఖని, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 70 శాతం షూట్ కంప్లీట్ అయిపొయింది.

అయితే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకింద స్టార్ట్ అయిన ఈ సినిమా షూట్ ఇప్పటికి కంప్లీట్ కాలేదు. దానికి కారణం శంకరే అని అందరికి తెలుసు. శంకర్ “గేమ్ ఛేంజర్” కంటే ముందే ఇండియన్2 సినిమా అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాకి గ్యాప్ ఇస్తూ ఈ సినిమా షూట్ కంప్లీట్ చేస్తున్నాడు. అందువల్ల గేమ్ చేంజర్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా రావట్లేదని చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ బర్త్ డే కి టీజర్ వస్తుందని ఆశ పడిన అభిమానులు కేవలం టైటిల్ పోస్టర్ తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

- Advertisement -

అయితే టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సినిమాల అప్ డేట్లు వరుస పెట్టి వస్తుండడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా శంకర్ ని ఎదో ఒక అప్ డేట్ ఇవ్వమని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ , ప్రభాస్ మూవీల టీజర్స్, ఇంకా మూవీ అప్ డేట్లు వచ్చి ఫ్యాన్స్ కి సంతోషాన్నిచ్చాయి. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టీజర్ కూడా మే31 న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ రెండేళ్లకిందట స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ నుండి మాత్రం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇప్పటివరకు ఏ అప్ డేట్ కూడా రాలేదు. మరి శంకర్ ఇప్పటికైనా ఫ్యాన్స్ ఆత్రుతని దృష్టిలో పెట్టుకొని సినిమాకి సంబందించిన టీజర్ ని లేదా సాంగ్ నైనా విడుదల చేస్తే బాగుంటుందని ట్రేడ్ పండితులు కూడా సూచిస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు