Johnny Master case : జాతీయ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చెసిన విషయం అందరికీ తెలుసు.. ఉదయం నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ ఫుల్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్న జానీ మాస్టర్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురయ్యాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఓ లేడి కొరియోగ్రాఫర్ ఇచ్చినా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఓ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం.. బెదిరింపులకు పాల్పడటం.. గాయపర్చటం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు.. ఇక మాస్టర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నాయి. తదుపరి విచారణ కోసం మహిళను పోలీస్ స్టేషన్ కు రమ్మంటే ఆమె విచారణకు మీడియా ముందుకు రమ్మని పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు.. కానీ ఆమె రాకపోవడం పై అనేక అనుమానాలు పుట్టుకోస్తున్నాయి.
బాధితురాలి స్టేట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు..
జానీ మాస్టర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులను యువతి ఆశ్రయించింది.. ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.. ఆమె ఫిర్యాదులో పొందుపరిచిన వివరాల మేరకు కేసును నమోదు చేశారు.. చెన్నై, ముంబయి.. హైదరాబాద్ లతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళలోనూ.. హైదరాబాద్ లోని తన నివాసమైన నార్సింగ్ లోనూ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు నార్సింగ్ పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని నార్సింగ్ సీఐ హరికృష్ణారెడ్డి (CI Harikrishna Reddy ) మీడియాతో తెలిపారు.. కానీ సహకరించలేదని, ప్రస్తుతం అందుబాటులో లేనని చెబుతోందని ఆయన మీడియతో చెప్పారు. మరి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.. ఇక తాజాగా జానీ మాస్టర్ ను జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నోట్ రిలీజ్ చేసింది.