Chiranjeevi: 33ఏళ్ళు పూర్తి చేసుకున్న జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా సృష్టించిన రికార్డులు తెలుసా?

“జగదేకవీరుడు అతిలోకసుందరి”. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు. వరదల్లో వచ్చి కలెక్షన్ల వరద పారించింది ఈ సినిమా. అలాంటి ఈ చిత్రం వచ్చి మే9 తో 33 యేళ్లు పూర్తి చేసుకుంది. మరి అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి తెలిస్తే దీన్ని మించిన సినిమా లేదంటారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 1990 మే 9న విడుదలై అప్పటివరకు ఉన్న తెలుగు చిత్ర రికార్డలులన్నింటిని బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఇండీస్ట్రీ హిట్ మూవీ గా నిలిచింది. అప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు వచ్చినా ఈ మూవీ మాత్రం చాలా ప్రత్యేకమైనది. “సోషియో ఫాంటసి” మూవీగా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి 5 వ ఇండస్ట్రీ హిట్ ని సంపాదించి పెట్టింది.

విహారానికై భూలోకం వచ్చిన దేవకన్య అయిన ఇంద్రజ పొరపాటున తన ఉంగరం జారవిడుచుకొని దేవలోక ప్రవేశ అర్హతని కోల్పోతుంది. ఆ ఉంగరం భూలోక వీరుడైన రాజు అనే వ్యక్తికి దొరుకుతుంది. ఆ ఉంగరాన్ని రాజు దగ్గర్నుంచి చేజిక్కించుకొనే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేంటి? రాజు వ్యక్తిగత జీవితం ముడిపడిన ఇంద్రజ తిరిగి దేవలోకం వెళ్లిందా లేదా? అనేదే కథ.

- Advertisement -

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను ఆరోజుల్లోనే 2కోట్లకు పైగా పెట్టుబడితో తీశారు. ఈ మూవీ కోసం మద్రాస్ లో వాహిని స్టూడియోస్ లో వేసిన సెట్ అప్పటివరకు అతిపెద్ద మూవీ సెట్ అని చెప్పుకొన్నారు. ఈ సినిమా హైదరాబాద్ ఓడియన్70mm థియేటర్లో 365రోజులాడింది. అంతే కాదు, మే 9న ఈ మూవీ విడుదలైనరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. కరెంటు లేక జనాలు చాలా ఇబ్బందిపడ్డారు. సినిమా చూడటం సంగతి అటుంచితే కనీసం అలాంటి సినిమా వచ్చినట్లు కూడా ప్రజలకు తెలియకపోవడం మరో విషాదం.
అయినా పట్టు వదలకుండా నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.

ఆ నోటా ఈ నోటా మూవీ గురించి తెలుసుకొని మెల్లిమెల్లిగా జనాలు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అలా తుఫాన్ లాంటి వసూళ్లను జగదేకవీరుడు అతిలోకసుందరి తీసుకొచ్చింది.చిరంజీవి, శ్రీదేవి జోడీ.. దర్శకేంద్రుడి విజన్.. విన్సెంట్ సినిమాటోగ్రఫీ.. ఇళయరాజా సంగీతం.. వేటూరి సాహిత్యం ఇలా అన్నీ కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని చరిత్రలో నిలిపాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని ‘ఆద్మీ ఔర్ అప్సర’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రాన్ని తమిళంలో “కాదల్ దేవతై” మరియు మలయాళంలో “హై సుందరి” అనే పేరుతో డబ్ చేయగా అక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే 8 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం 15 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. 47 కేంద్రాల్లో యాభై రోజులాడిన ఈ సినిమా 29 కేంద్రాల్లో వందరోజులాడింది. ఇక ఆ రోజుల్లో చిరంజీవి స్వయంగా ఈ చిత్ర రెమ్యూనరేషన్ మొత్తాన్ని వరదల్లో నష్టపోయిన ప్రజలకు కొంత మేర సాయం చేశారు. ఈ గొప్పదనము ఆయన్నిఅందనంత ఎత్తులో కూర్చోబెట్టింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు