Adhipurush : బాలీవుడ్ సాక్షిగా ప్రభాస్ ని వెనకేసుకొస్తున్న కృతి సనన్ !

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆదిపురుష్. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ నటిస్తుంది. వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే చాలా రోజుల క్రితమే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వియఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలనే విఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో మూవీ యూనిట్ ఆదిపురుష్ ట్రైలర్ ని విడుదల చేసింది. మొదట కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో 3డి లో ట్రైలర్ ని విడుదల చేసిన మూవీ టీం, తరువాత డిజిటల్ లో రిలీజ్ చేసింది. అయితే గతంలో రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ అందుకున్న మూవీ టీం, ట్రైలర్ కి మాత్రం ప్రశంసలు అందుకుంటుంది. టీజర్ రిలీజ్ అయినపుడు యానిమేషన్ సినిమాగా అనుకున్న అందరు ట్రైలర్ చూసి వారి అభిప్రాయాలని మార్చుకున్నారు. “శ్రీ రాముడిగా ప్రభాస్ సరిగ్గా సరిపోయాడంటూ, డైలాగ్స్, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి ” అంటూ మూవీ టీమ్ ని అందరు ప్రశంశిస్తున్నారు.

అయితే ముంబై లో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్ ” ప్రేమ, గౌరవంతో ఆదిపురుష్ సినిమా చేసాం, మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం” అంటూ రెండు మాటలతో తన స్పీచ్ ని ముగించాడు. అందరు ప్రభాస్ ఎదో మాట్లాడతాడని అనుకున్నారు కానీ ప్రభాస్ పెద్దగా ఏమి మాట్లాడకుండ స్పీచ్ ముగించేసరికి , అందరు షాక్ అయ్యారు. అప్పుడే కృతి సనన్ మైక్ తీసుకొని ” ప్రభాస్ కూడా ఆ శ్రీరాముడిలాగే చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ మాట్లాడిన రెండు మాటలైన హార్ట్ ఫుల్ గా మాట్లాడతారు” అంటూ ప్రభాస్ ని అందరి ముందు వెనకేసుకొచ్చింది. గతంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు వార్తలొచ్చిన క్రమంలో కృతి సనన్ ప్రభాస్ ని వెనకేసుకు రావడంతో వీళ్లా ప్రేమ వ్యవహారం నిజమేనెమో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అందరు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు