Suresh Productions: 26 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రేమించు కుందాం రా!

దగ్గుపాటి వెంకటేష్ కు విక్టరీ పేరును సార్థకం చేస్తూ, టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో వెంకటేష్ ను నిలిపిన చిత్రం ప్రేమించుకుందాం రా! 1997 మే9 న విడుదలైన ఈ మూవీ నేటితో 26సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి తెలుసుకుందాం.

1996 వరకు వెంకటేష్ కెరీర్ కొంచెం డల్ గా సాగింది. అబ్బాయి గారు, ముద్దుల ప్రియుడు, ధర్మ చక్రం, పవిత్ర బంధం లాంటి సినిమాలు మంచి హిట్స్ అయినా కొత్తగా ఎదో తెలియని వెలితి. కొత్తగా ట్రెండ్ క్రియేట్ చెయ్యాలన్న తపన వెంకటేష్ ని నిద్రపోనివ్వలేదు. అప్పుకొచ్చింది ఒక లవ్ స్టోరీ. 1997 లో జయంత్ సి. పర్జాని దర్శకుడ్ని పరిచయం చేస్తూ, సురేష్ ప్రొడక్షన్ లో డి. రామానాయుడు నిర్మించిన సినిమా “ప్రేమించుకుందాం రా”!. అప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ గా, మాస్ హీరోగా ఉన్న వెంకటేష్ ని తిరిగి పాతరోజుల్లోకి తీసుకెళ్ళి, తనలోని లవర్ బాయ్ నిద్ర లేపింది ఈ సినిమా. ఆ రోజుల్లో యూత్ ఎగబడి చూసిన చక్కటి ప్రేమకథా చిత్రమిది.

వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో అంజాలా జవేరి హీరోయిన్ గా నటించింది. హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయడంలో వెంకటేష్ దిట్ట అని తెలుసు. ఈ సినిమా తో అంజలా జవేరి ని తెలుగు తెరకి పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాకు మణిశర్మ, మహేష్ మహదేవన్ కలిసి బాణీలందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్. ఈ సినిమాలో వచ్చే “లిటిల్ హార్ట్స్ లవ్ ప్రపోజల్ సీన్ సినిమాకే హైలెట్.

- Advertisement -

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి లవ్ స్టోరీ జతగా వచ్చిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాసింది. ఈ సినిమానే టాలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా అప్పటి ప్రేక్షకులు చెప్తారు. అయితే ఆ తరువాత వచ్చిన సమర సింహారెడ్డిలో హీరో, విలన్ ఇద్దరు ఫ్యాక్షనిస్ట్ లే కావడంతో అది పూర్తి స్థాయి ఫ్యాక్షన్ మూవీ గా చెప్పబడింది.

వెంకటేష్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో టాలీవుడ్ కి మూడో సారి చూపించిన సినిమా “ప్రేమించుకుందాం రా”. అంతకు ముందు బొబ్బిలి రాజా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెంకటేష్ ని స్టార్ హీరోని చేసింది. ఆ తర్వాత 1992 లో వచ్చిన చంటి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యి వెంకటేష్ ని ఫోర్ పిల్లర్స్ లో ఒకడిగా నిలిపింది. చంటి తర్వాత ఆ రేంజ్ హిట్ రావడానికి వెంకటేష్ 5ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే ప్రేమించుకుందాం రా మూవీ.

ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాదాపు 12.50 కోట్లకి పైగా షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ ని కొద్దిలో మిస్ అయింది. అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పెదరాయుడు(14cr ) తరువాత స్థానంలో ఉంది. ఇక ప్రేమించుకుందాం రా 53 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా ఇది. ఇక ప్రేమించుకుందాం రా మూవీ కి కొద్ది రోజుల ముందే విడుదలైన ఒసేయ్ రాములమ్మ, అన్నమయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో వాటి వల్ల ఇండస్ట్రీ హిట్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఇక గత సంవత్సరం ప్రేమించుకుందాం రా పాతికేళ్ల సెలెబ్రేషన్స్ లో చిత్ర యూనిట్ అంతా కలుసుకున్న విషయం తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు