SSMB28: ఆ సినిమా ప్లాప్ అయినా మరో ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్డే

పూజా హెగ్డేకు వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా సరే బాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదంటోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తను ఇక్కడ ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని బాలీవుడ్ పైన మోజుతో అక్కడే సినిమాలు చేయాలనీ చూస్తుంది పూజ. ఈ మధ్యనే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ మూవీ లో హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరో సినిమా కాబట్టి హిట్ అయితే హిందీలోనూ టాప్ హీరోయిన్ అయిపోతానని కలలు కంది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. విడుదలైన ఫస్ట్ డే నే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ డిజాస్టర్ టాక్ మూట గట్టుకుంది.

ఇక అంతకు ముందు పూజా హీరోయిన్ గా చేసిన సర్కస్, హౌస్ ఫుల్ 4 సినిమాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి. అసలు ఎప్పుడో డెబ్యూ చేసిన హృతిక్ రోషన్ మొహంజాదారో సినిమా నుంచి పూజా హెగ్డే కి లక్ తగలకుండా డిజాస్టర్లు పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో పూజ హెగ్డే ఒక ఐరన్ లెగ్ హీరోయిన్ అయిపొయింది అనొచ్చు.

ఇన్ని ప్లాపులొచ్చినా సరే పూజా హెగ్డే మరో హిందీ మూవీ ఆఫర్ దక్కించుకుంది. షాహిద్ కపూర్ హీరోగా రాబోయే “కోయి షక్” లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యిందని ముంబై నుంచి వార్తలొస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు రోషన్ ఆండ్రూస్. ఈయన మలయాళం డైరెక్టర్. దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్లు మూవీస్ తీసాడు. మిస్టరీ థ్రిల్లర్స్ డీల్ చేయడంలో రోషన్ ది ప్రత్యేక శైలి. మొదటిసారి హిందీ డెబ్యూ చేయబోతున్నారు. ఈ మూవీ లో పూజా హెగ్డే రోల్ ఏంటో తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇక టాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు28 మీదే ఉన్నాయి. గత సంవత్సరం రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య డిజాస్టర్లతో పూజా హెగ్డే మార్కెట్ డిమాండ్ మీద ప్రభావం పడింది. ఇప్పుడు వెనుకబడకుండా ఉండాలంటే పూజాకు ఏ భాష అయినా వదలకుండా అన్ని చోట్ల మూవీస్ చేయాలి. లేదంటే హీరోయిన్ గా తన మనుగడ కష్టం. కానీ పూజా మాత్రం ఒక్క హిందీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. మరి చూడాలి పూజా ఇకనైనా మారుతుందో లేదో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు