Vijay Kanakamedala: ఉగ్రం చిత్ర యూనిట్ ను అభినందిస్తున్న హిజ్రాలు

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో హరీష్ పెద్ది నిర్మించాడు. మే 5న విడుదలైన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే రామబాణం సినిమాతో పోటీగా రిలీజ్ అయినందువల్ల ఈ సినిమాకు అంత ఓపెనింగ్స్ రాలేదు. అదీ గాక ప్రమోషన్లు కూడా పెద్దగా చేయకపోవడం ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది.

అయితే నరేష్ అద్భుతమైన నటనతో మంచి మౌత్ టాక్ తో డీసెంట్ కలెక్షన్లను అందుకుంటుంది ఉగ్రం సినిమా. తెలుగు రాష్టాల్లో మొదటి రోజు 60లక్షలు మాత్రమే రాబట్టిన ఈ సినిమా రెండో రోజు 73లక్షలకు పైగా షేర్ రాబట్టింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2.10 కోట్ల షేర్ వసూలు చేసి పలు చోట్ల హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది.

ఉగ్రం సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో ప్రమోషన్లు కూడా బాగా చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో ఉగ్రం చూసిన కొంతమంది హిజ్రాలు అల్లరినరేష్ ని అలాగే చిత్ర యూనిట్ ని ప్రశంసితున్నారు. తమ గురించి ఇందులో చాలా గొప్పగా చెప్పారని, నకిలీ హిజ్రాలకు, అసలైన హిజ్రాలకు తేడా ఉగ్రం మూవీలో చూపించారని అన్నారు. రీసెంట్ గా ఉగ్రం టీమ్ విడుదల చేసిన ప్రోమోలో కూడా హిజ్రా ల గురించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. హిజ్రాలంటే ఎవరో కాదు అర్ధనారీశ్వరుడి స్వరూపమని ఆ ప్రోమోలో నరేష్ అంటాడు. ఏది ఏమైనా ఉగ్రం రిజల్ట్ ఎలా ఉన్నా చిత్ర యూనిట్ కు, వాళ్లకు పడ్డ కష్టానికి సర్వత్రా ప్రశంసలు, అభినందనలు దక్కుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు